అస్సలు అనుకోలేదు.. ఇలా చేస్తానని..: రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో అగ్రహీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేస్తున్న రకుల్ ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యమిస్తుందన్న సంగతి తెలిసిందే. తాను వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. మాంసాహార వంటకాలను ఇష్టంగా తినే రకుల్ ఏడాది నుంచి వీగన్‌గా మారి పోయింది.. మాంసాహార వంటలే కాదు.. వీగన్‌గా మారిన వారు జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, పెరుగు, నెయ్యి వంటివి కూడా తీసుకోరు.
వీగన్‌గా మారి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ఇది నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకో కొన్ని రోజులు మాంసాహారం తినాలనిపించలేదు. దాంతో తినడం మానేశాను.. ఇది నేను చేసే ధ్యానంపై చాలా ప్రభావం చూపించింది. నా శరీరంలో మంచి మార్పు వచ్చింది. శరీరమంతా చాలా తేలికగా ఉండడం, నిగారింపు పెరగడం గమనించాను. మంచిని ఎప్పుడూ కొనసాగించాలి.. కాబట్టి పూర్తి వీగన్‌గా మారిపోయాను అని రకుల్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com