Rakul Preet Singh : పెళ్లికి ముందు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో రకుల్

Rakul Preet Singh : పెళ్లికి ముందు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో రకుల్
జాకీ భగ్నానితో వివాహానికి ముందు, నటి రకుల్ ప్రీత్ సింగ్ తన కుటుంబం, స్నేహితులతో కనిపించింది. 2024 ఫిబ్రవరి 21న గోవాలో వీరి పెళ్లి జరగనుంది.

నటి రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వీరి పెళ్లికి కౌంట్ డౌన్ మొదలై పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. పెళ్లికి కొన్ని వారాల ముందు రకుల్ తన కుటుంబం,స్నేహితులతో కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఆమె తన కుటుంబం, స్నేహితులతో వారి ఇంట్లో గ్రాండ్ వెడ్డింగ్ కోసం సన్నాహకాల మధ్య కనిపించింది. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో, రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని బహుమతులతో పాటు తన తల్లిదండ్రులతో కలిసి తన కారు నుండి దిగడం చూడవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ శాటిన్ షర్ట్, తెలుపు, నలుపు డిజైన్ స్కర్ట్‌లో ఉంది. ఆమె నల్లని బూట్లతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నాని ప్రస్తుతం తమ పెళ్లికి సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ఈ జంట ఫిబ్రవరి 21, 2024న గ్రాండ్ వెడ్డింగ్ వేడుకను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ జంట నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వారు తమ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు జాకీ, రకుల్ తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

వర్క్ ఫ్రంట్‌లో, రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా 'అయాలాన్' అనే తమిళ చిత్రంలో కనిపించింది. ఆర్.రవికుమార్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, కరుణాకరన్ తదితరులు నటించారు. ఆమె తదుపరి 'భారతీయుడు 2'లో కనిపించనుంది. S.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, SJ సూర్య, కాజల్ అగర్వాల్ , సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, జయరామ్ తదితరులు నటించనున్నారు.

ధృవ, సరైనోడు, స్పైడర్, ధీరన్ అధిగారం ఒండ్రు, రఫ్, నాన్నకు ప్రేమతో, విన్నర్, దేవ్, బ్రూస్ లీ వంటి ప్రముఖ చిత్రాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. హిమాన్ష్ కోహ్లి, నికోల్ ఫారియా, ఎవెలిన్ శర్మతో కలిసి యారియాన్‌లో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దివ్య ఖోస్లా కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎటాక్, రన్‌వే 34, కట్‌పుట్ల్లి, డాక్టర్ జి, ఛత్రివాలి, ఐ లవ్ యు వంటి హిందీ చిత్రాలలో కూడా నటించింది.

Tags

Next Story