Andhra King Taluka : రామ్.. బ్యాడ్ లక్

Andhra King Taluka :  రామ్.. బ్యాడ్ లక్
X

రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ ఆంధ్రాకింగ్ తాలూకా. ఈ మూవీకి మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. చూసిన వాళ్లంతా బావుంది మూవీ అనేశారు. బట్.. వసూళ్లు మాత్రం ఉసూరుమనిపించేలా ఉన్నాయి. ఓ వైపు అతను యూఎస్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. బట్ ఇండియాలో మాత్రం సినిమాపై పెద్దగా ఊసు లేకుండా పోయింది. ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఒక రోజు ముందే విడుదల చేసినా సినిమాపై ఓపెనింగ్స్ లేకపోవడం వింతే కదా. పైగా తర్వాతైనా మూవీ టాక్ ను బట్టి చూస్తారు జనం అని భావించారు. బట్ అలాంటిదేం కనిపించలేదు. వీకెండ్ మొత్తం వీక్ గానే ఉంది. సినిమాపై పెద్దగా టాక్ లేకపోవడం కామన్ గా చూశాం. జనం చూడాలనుకోవడం లేదు అసలు అని భావించారు. అసలు ఫ్లాపుల్లో ఉండటం ఓ పెద్ద మైనస్ గా అయింది.

ఓ రకంగా రామ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఇదే అనుకోవచ్చు. అలాగే అతని కథలు నేల పైనే చూడటం కూడా ఇదే ఫస్ట్ టైమ్. ఉపేంద్ర నటన బాగా ప్లస్ అయింది. భాగ్యశ్రీ బోర్సే పాత్ర, నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. 2000 యేడు కాలంలో కథనం సాగేలా ఉంది. చిన్న చిన్న మైనస్ లు ఉన్నా ఓవరాల్ గా సినిమా బావుంది అనిపించుకుంది. ఇన్ని ఉన్నా.. మూవీపై రావాల్సినంత క్రేజ్ మాత్రం రాలేదు. ఓ రకంగా రామ్ కెరీర్ విషయంలో జనం సీరియస్ నెస్ చూడలేకపోవడం కూడా ఓ కారణం అనిపిస్తోంది. వరుసగా వస్తోన్న ఫ్లాప్స్ కూడా అతనికి మెల్లగా మైనస్ గా మారింది. ఇది సీరియస్ నెస్ లోపించడం అంటే కూడా అదే. ఏదేమైనా రామ్ ఎలాంటి కథల్లో సెట్ అవుతాడా అనేది మాత్రం పెద్ద ఫజిల్ గా అయిపోయింది.

Tags

Next Story