Forbes Cover Page : ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్యూట్ కపుల్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు మరో మారు అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ వీరిద్దరి ప్రత్యేకతను వివరిస్తూ ఓ కవర్ స్టోరీ ప్రచురించింది. సూపర్ కపుల్ అంటూ ప్రశంసించింది. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతోంది.
కొద్ది రోజులుగా ఈ దంపతులు తమ కూతురు క్లింకారతో కలిసి ముంబైలో పలు ప్రదేశాలను, ఆలయాలను సందర్శిస్తున్నారు. డిసెంబర్ 22న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి అతిథిగా వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వారికి పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. అంతేకాకుండా వారికి వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక తాజాగా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా.. చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజీపై ప్రశంసలతో ముంచెత్తారు.
అయితే వీరిద్దరూ ముంబైలో ఆలయాలను సందర్శించడం పక్కన పెడితే.. మహారాష్ట్ర సీఎంని ఎందుకు కలిశారు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. తెలుగు హీరో అయిన రామ్ చరణ్ ఎక్కడో మహారాష్ట్ర సీఎం ఇంటికి అతిథిగా వెళ్లడం ఏంటి..? అక్కడ సీఎం ఇంటి ఆడపడుచులతో హిందూ పద్దతిలో ఆతిథ్యం అందుకోవడం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక, ప్రఖ్యాత మేగజైన్ పైన టాలీవుడ్ ఫస్ట్ కపుల్ అరుదైన ఘనత సాధిస్తూ స్టైలిష్గా చెర్రీ, ఉప్సీ ప్రచురితమైన కవర్ పేజీ కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది.
వర్క్ ఫ్రంట్ లో..
రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
Latest 📸
— Ujjwal Reddy (@HumanTsunaME) December 22, 2023
World's Top Magazine Forbes recent edition features 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan garu & his wife @upasanakonidela garu #GlobalStarRamCharan 🔥👑#RamCharan #GameChanger pic.twitter.com/LudlxveClS
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com