Ram Charan-Anjali : ఈసారి రామ్ చరణ్-అంజలి

Ram Charan-Anjali : ఈసారి రామ్ చరణ్-అంజలి
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పొలిటికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు రామ్ చరణ్. అందులో తండ్రి పాత్రకి జోడీగా అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు కీలకం కానున్న ఆ పాత్రలకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాపై అంచనాలు కూడా పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో మూడో పాట విడుదలపై అప్డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ పాత్ర రామ్ చరణ్, అంజలి మధ్య సాగే ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది. మెలోడీగా సాగే ఈపాట శ్రోతల హృదయాల్ని హత్తుకుంటుంది అని చెప్పుకొచ్చాడు తమన్. అక్టోబర్ నెలలోనే ఈ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది

Tags

Next Story