Ram Charan : రామ్ చరణ్, సుకుమార్ సినిమా స్టార్ట్.. ఎప్పుడంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించలేకపోయాడు. ఆచార్య డిజాస్టర్ అయింది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. అందుకే పెద్ది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మూవీతో మరోసారి ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అనిపించేలా ఉన్నారు. అతను కేవలం క్రికెటర్ గానే కాక కొన్ని గ్రామీణ క్రీడల్లో కూడా ఎక్స్ పర్ట్ గా కనిపించబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. మొత్తంగా ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నారు. మరి ఆ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా అంటే సుకుమార్ దే.
రామ్ చరణ్ ఆల్రెడీ సుకుమార్ తో చేసిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో రామ్ చరణ్ గొప్ప నటన చూపించాడు. ఫస్ట్ టైమ్ లో అతనిలో గొప్ప నటుడు ఉన్నాడు మాట తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో అది కంటిన్యూ చేశాడు. ఇప్పుడు పెద్దితోనూ తనలోని నటుడ్ని చూపించబోతున్నాడు అనేలా ఉంది. అయితే మరోసారి సుకుమార్ తో చేయబోయే మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథ పూర్తయ్యాక ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఈ యేడాది సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఆ టైమ్ కు అన్ని పనులు పూర్తి చేసుకుని సెట్స్ లో అడుగుపెడతాడ రామ్ చరణ్ అంటున్నారు. అంటే ఈ మూవీ వచ్చే యేడాది చివర్లో విడుదలవుతుందా లేక చాలా టైమ్ తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉండబోతాయి అనేది వాస్తవం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
