Megastar Tweet: తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన: చిరంజీవి ట్వీట్

Megastar Tweet: రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కామినేని కలిసి తమ మొదటి బిడ్డను త్వరలో స్వాగతించబోతున్నారు. ఈ విషయాన్ని కొణిదెల కుటుంబం అధికారికంగా ప్రకటించింది. కొత్త సంవత్సరం, 2023 ఖచ్చితంగా రామ్ చరణ్ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది.
జూలైలో రామ్ చరణ్ మరియు ఉపాసన తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలో జరుపుకున్నారు. చరణ్, ఉపాసన ఓ కాలేజీలో కలిశారు. ఒక సంవత్సరం ప్రేమాయణం తర్వాత జూన్ 14, 2012న వారు పెళ్లి చేసుకున్నారు.
'హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమతో.. సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని'' అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్‌గా నిలిచింది.
ఇక ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీలో వరుస శుభవార్తలు వస్తున్నాయి.. ఈమధ్యే చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ-2022 అవార్డు రాగా.. వరుస హిట్లతో తండ్రీ కొడుకులు దూసుకుపోతున్నారు.. ఇన్ని సంతోషాల మధ్య పండగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరో స్వీట్ న్యూస్‌ను ట్విట్టర్ వేదికగా చిరంజీవి చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
రామ్ చరణ్ రాబోయే సినిమాలు
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో రామ్ చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com