Ram Charan : రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీ బ్యాక్ డ్రాప్ ఇదా..?

Ram Charan :  రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీ బ్యాక్ డ్రాప్ ఇదా..?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ ను పట్టించుకోకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ పై ముందు నుంచీ కొందరు నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. బ్యాడ్ రివ్యూస్ రాయించారు. మొదటి రోజే ఆన్ లైన్ లో లీక్ చేయించారు. ఇవన్నీ కలిపి కలెక్షన్స్ పైనా ప్రభావం చూపించాయి. అయితే ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ మాత్రం తగ్గలేదు చరణ్ కు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన లో సినిమా చేస్తున్నాడు. ఉప్పెనతో ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొట్టాడు బుచ్చిబాబు. తర్వాత ఎన్టీఆర్ తో చేయాలనున్నాడు. కానీ డేట్స్ సెట్ కాలేదు. దీంతో రామ్ చరణ్ కు మరో కథ చెప్పి ఒప్పించాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

రామ్ చరణ్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేస్తున్నా అన్నాడు బుచ్చిబాబు. దీంతో చాలామంది రకరకాల ఆటలను ఊహించుకున్నారు. బట్ ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా అని లేటెస్ట్ గా తేలిపోయింది. తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ మూవీ షూటింగ్ గురించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ అప్డేట్ లోనే అతను క్రికెట్ గురించి చెప్పాడు. తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో రత్నవేలు.. 'నైట్ షూట్.. ఫ్లడ్ లైట్స్.. పవర్ క్రికెట్.. వియర్డ్ యాంగిల్స్.."అని పోస్ట్ చేశాడు. దీంతో ఫ్లడ్ లైట్స్ క్రికెట్ కే ఎక్కువగా వాడతారు కాబట్టి, పైగా క్రికెట్టు, డిఫరెంట్ యాంగిల్స్ అని కూడా చెప్పాడు కాబట్టి ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ అని తేలిపోయిందంటున్నారు నెటిజన్స్.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్.సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈ యేడాది దసరాకే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. మొత్తంగా రామ్ చరణ్ బ్యాట్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడన్నమాట.

Tags

Next Story