Ram Charan: ఆన్ లైన్ లో రామ్ చరణ్ డెనిమ్ జాకెట్ .. ధర చూస్తే షాకే..

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. తమ పదేళ్ల వివాహ జీవితాన్ని స్వీట్ మెమరీగా మలుచుకునేందుకు ఇటలీలో పెళ్లి రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు.
సెలబ్రేషన్స్ లో వారు వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. పెళ్లి రోజున రామ్ చరణ్, ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు రూ. 2,23,049 అని సమాచారం. ఎయిర్ పోర్ట్ లో డెనిమ్ జాకెట్ వేసుకుని స్టయిలిష్ లుక్ లో అదరగొడుతున్న రామ్ చరణ్ కెమెరా కంటికి చిక్కారు.
అతడు ధరించిన జాకెట్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. రా అని రాసి ఉన్న ఈ జాకెట్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉండగా, కొనాలని ఉన్నా ఖరీదు చూసి నోరెళ్ల బెడుతున్నారు రాం చరణ్ ఫ్యాన్స్. ఫాన్ ఇండియా స్టార్ గా మారిన తరువాత రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ మారింది.
కాగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ 15వ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇటీవల మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ కి సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com