Ram Charan : మళ్లీ డ్యూయొల్ రోల్ చేస్తోన్న రామ్ చరణ్

Ram Charan :  మళ్లీ డ్యూయొల్ రోల్ చేస్తోన్న రామ్ చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఏ సినిమా చేసినా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే కథలు ఎంచుకోవాలి. రీసెంట్ గా వచ్చిన గేమ్ ఛేంజర్ తో ఫ్లాప్ చూశాడు చరణ్. అయినా అతని రేంజ్ మారదు.ఈ మూవీలో డ్యూయొల్ రోల్ తో మెప్పించాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలోని నటనకు జనం ఫిదా అయిపోయారు.రంగస్థల నుంచి నటనకు ప్రాధాన్యం ఉండేలానూ చూసుకుంటోన్న చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. క్రికెట్ గేమ్ నేపథ్యంలో సాగే ఈ మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్ లో మరో బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబుతో ఇంతకు ముందు రంగస్థలం టైమ్ లో పనిచేసి ఉన్నాడు చరణ్.రంగస్థలంకు బుచ్చిబాబు కో డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

బుచ్చిబాబు తర్వాత మరోసారి సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిందీ ప్రాజెక్ట్. పుష్ప 1, పుష్ప 2తో ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు ఓ రేంజ్ లో పరిచయం అయ్యాడు సుకుమార్. ఇటు రామ్ చరణ్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్. సో.. ఈ కాంబినేషన్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడం ఖాయం అనుకోవచ్చు.ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి వినిపిస్తోన్న గాసిప్ ఏంటంటే.. రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. మరి ఈ రెండు పాత్రలు ఒకేసారి ఉంటాయా.. లేక గేమ్ ఛేంజర్ లా ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఏదైనా ఉంటుందా అనేది అప్పుడే చెప్పలేం. బట్ డ్యూయొల్ రోల్ పక్కగా ఉంటుందట.

రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా నాయక్. తర్వాత గేమ్ ఛేంజర్. ఈ వార్త నిజమే అయితే మూడో సినిమా సుకుమార్ ది అవుతుంది.

Tags

Next Story