Ram Charan : అక్కడా రామ్ చరణ్ సొంత గొంతునే వినిపించాడు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ ఫస్ట్ షాట్ తో ఎంటైర్ కంట్రీని షేక్ చేశాడు. ఈ ఫస్ట్ షాట్ వరకూ బుచ్చిబాబును తక్కువ అంచనా వేసిన వాళ్లు సైతం వావ్ అనేస్తున్నారు. ఆ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు తన హీరోను. నిజానికి ఈ రేంజ్ ఊరమాస్ ను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మరోసారి రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండటంతో పాటు శ్రీకాకుళం స్లాంగ్ లో డైలాగులు చెప్పడం తెలుగు ప్రేక్షకులకు సైతం కొత్తగా అనిపించింది. పైగా ఆ డిక్షన్ ను పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు చరణ్. అందుకే శ్రీ రామనవమి పండగతో పాటు ఈ ఫస్ట్ షాట్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక తాజాగా ఈ ఫస్ట్ షాట్ హిందీ గ్లింప్స్ కూడా విడుదలైంది. ఈ గ్లింప్స్ చూస్తే హిందీ డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు రామ్ చరణ్. అక్కడా డిక్షన్ బలే ఉంది. పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు. తెలుగు భాషకు తగ్గ మాడ్యులేషన్ హిందీలోనూ పలికించాడు.
బుచ్చిబాబు నిజంగానే రామ్ చరణ్ ను నెవ్వర్ బిఫోర్ అవతార్ లో చూపించబోతున్నాడని అందరికీ అర్థం అయింది. ఇక దేవర తర్వాత జాన్వీ కపూర్ నటిస్తోన్న తెలుగు సినిమా ఇది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది మార్చి 27న పెద్ది చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com