రామ్ వర్సెస్ రామ్.. 'సీటు హీట్ ఎక్కుతోంది'..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' అనే రియాలిటీ షో రానుంది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు ఎన్టీఆర్. ఇటీవలే ఈ షో ఎప్పటి నుంచి స్టార్ట్ కానుందో క్లారిటీ ఇచ్చారు. అగష్టు 22వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. తొలి ఎపిసోడ్‌కు యువ కథానాయకుడు రామ్‌చరణ్ విచ్చేసి సందడి చేశారు. ఎన్టీఆర్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. ''ఈనెల 22న 'ఎవరు మీలో కోటీశ్వరులు' ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నాం. సోదరుడు రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ఈ కర్టెన్ రైజర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశారు.
ఇక షోలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి, హోస్ట్‌సీట్‌లో కూర్చోబోయారు. వెంటనే ఎన్టీఆర్.. అది హాట్ సీటు.. ఇది హోస్ట్ సీటు అని చెప్పడంతో చెర్రీ వెళ్లి హాట్ సీటులో కూర్చొన్నారు. ఇక ఎన్టీఆర్ వేసిన ప్రశ్న విన్న తర్వాత 'సీటు హీట్ ఎక్కుతోంది.. బ్రెయిన్ హీట్ ఎక్కుతోంది' అంటూ చరణ్ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో చూసేయండి. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com