Ram Charan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను వదిలేశారా ఫ్యాన్స్..?

స్టార్ హీరో సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుంది..? ఓ రేంజ్ లో కనిపిస్తుంది. బట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వెరైటీగా ఉన్నారు. నెక్ట్స్ రిలీజ్ కాబోతోన్న మూవీని వదిలేసి ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమాను లేపుతున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ ప్యాన్ ఇండియా డైరెక్టర్ ది. ఇంకా స్టార్ట్ కాని మూవీ దర్శకుడి వయసు ఒక్క సినిమా మాత్రమే. అయినా ఆ మూవీపైనే ఇంట్రెస్ట్ చూపిస్తుున్నారు. ఈ మూవీని లైట్ తీసుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాలేంటో గెస్ చేశారా..? యస్.. గేమ్ ఛేంజర్ అండ్ బుచ్చిబాబు మూవీ.
శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ ఛేంజర్ ను డిసెంబర్ 20న విడుదల చేస్తారు అనే ప్రచారం ఉంది.. కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ చేయలేదు. ఒకప్పుడు రాజమౌళి కంటే ముందే దేశవ్యాప్తంగా హిట్స్ కొట్టాడు శంకర్. మణిరత్నం తర్వాత కంట్రీ మొత్తం కవర్ అయ్యే విజయాలు అతనే అందుకున్నాడు కోలీవుడ్ నుంచి. అలాంటి శంకర్ ఫస్ట్ తెలుగు మూవీ ఇది. అయినా ఫ్యాన్స్ లో నమ్మకం లేదు. ఈ సినిమా అనుకున్న టైమ్ కు పూర్తి కాకపోవడం.. ఒకటైతే.. గేమ్ ఛేంజర్ ను వదిలేసి శంకర్ రూపొందించిన భారతీయుడు 2 డిజాస్టర్ కావడం మరో కారణం. దీంతో అప్పుడప్పుడూ నిర్మాత దిల్ రాజు ఏదో ఒకటి చెబుతున్నా అభిమానులు అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ బుచ్చిబాబు సినిమా పరిస్థితి వేరే ఉంది.
బుచ్చిబాబు సినిమాలో మేకోవర్ కోసం రామ్ చరణ్ వద్దకు వచ్చిన ట్రెయినర్ దగ్గర నుంచే లేపడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఈ మూవీలో అతని లుక్ తెలియదు. కథపై చిన్న క్లూ కూడా లేదు. అయినా శంకర్ సినిమాను కాదని బుచ్చిబాబుకు జై కొడుతున్నారు. మరి అభిమానుల అంచనాలు మిస్ అయ్యి రిజల్ట్ రివర్స్ అయితే ఏం చేస్తారో కానీ.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం విచిత్రంగానే ఉన్నారని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com