Ram Charan: మరో తమిళ డైరెక్టర్ కథకు ఓకే చెప్పిన రామ్ చరణ్..

Ram Charan: మరో తమిళ డైరెక్టర్ కథకు ఓకే చెప్పిన రామ్ చరణ్..
X
Ram Charan: వీటి తర్వాత మరో తమిళ దర్శకుడి కథకు చరణ్ ఓకే చెప్పినట్టు సమాచారం.

Ram Charan: ఒకప్పుడు ఒక భాషా దర్శకుడు.. ఆ భాషలోని హీరోతో మాత్రమే సినిమాలు రూపొందించేవాడు. చాలా తక్కువమంది మాత్రమే పక్క భాష హీరోలతో కూడా పనిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. భాషల సరిహద్దులను చెరిపేశాయి సినిమాలు. అందుకే వరుసగా పక్క భాషా దర్శకులతో పనిచేస్తున్నారు స్టార్ హీరోలు. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు.

'ఆర్ఆర్ఆర్' హిట్ తర్వాత రామ్ చరణ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఇదే సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు శంకర్‌తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్‌లో బిజీ అయిన చరణ్.. దీని తర్వాత 'జెర్సీ' దర్శకుడితో మూవీ కమిట్ అయ్యాడు. వీటి తర్వాత మరో తమిళ దర్శకుడి కథకు చరణ్ ఓకే చెప్పినట్టు సమాచారం.

లోకేశ్ కనకరాజ్.. ఈ తమిళ దర్శకుడి సినిమాలకు తమిళంలోనే కాదు తెలుగులో కూడా బాగానే క్రేజ్ ఉంది. ప్రస్తుతం లోకేశ్.. కమల్ హాసన్‌తో తెరకెక్కిస్తున్న 'విక్రమ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత రామ్ చరణ్‌తో తానొక సినిమా చేస్తున్నట్టు స్వయంగా చెప్పాడు లోకేశ్. వరుసగా తమిళ దర్శకులతో పనిచేస్తున్న చరణ్.. ఆర్ఆర్ఆర్ హిట్ ట్రాక్‌ను కొనసాగించాలని అభిమానులు అనుకుంటున్నారు.



Tags

Next Story