Ram Charan & KTR with NBK2: అవును.. అన్‌స్టాపబుల్‌కి వాళ్లిద్దరూ..

Ram Charan & KTR with NBK2: అవును.. అన్‌స్టాపబుల్‌కి వాళ్లిద్దరూ..
Ram Charan & KTR with NBK2: సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఎక్కడ కలిసినా హాయ్ చెప్పుకుంటారు.

Ram Charan & KTR with NBK2: సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఎక్కడ కలిసినా హాయ్ చెప్పుకుంటారు. సినిమా వేడుకలకు రాజకీయ నాయకులు హాజరవుతుంటారు. అంతవరకు బాగానే ఉంది.. అన్‌స్టాపబుల్‌కు వచ్చి వాళ్లిద్దరూ ఏం చెప్తారబ్బా.. సరదగా సాగిపోయే షో ఎన్‌బీకే. మరి ఇందులోకి సీరియస్‌నెస్‌ని కూడా తీసుకొస్తున్నారు షో నిర్వాహకులు.



ఇంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకువచ్చిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు వెరైటీగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, మెగా వారసుడు రామ్ చరణ్ ఎన్‌బీకేలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. విభిన్న దారుల్లో ప్రయాణిస్తున్నవారు ఎన్‌బీకేలో ఏం పంచుకుంటారో ప్రేక్షకులతో.


బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ బ్లాక్ బస్టర్ టాక్ షోగా నిలిచింది. రెండవ సీజన్ ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్ వంటి అతిధులతో అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే ముగిసిన పవన్ కళ్యాణ్ షో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


షోలో బాలయ్య.. పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించారు.. ఆయన వాటికి ఏం సమాధానాలు చెప్పారు అనేదానిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. షో స్ట్రీమ్ అవ్వడం ఆలస్యం అయ్యే కొద్దీ ఇవి మరింత ఆసక్తికరంగా మారాయి.



ఇక ఆ విషయం పక్కన పెడితే తదుపరి ఎపిసోడ్ అతిథుల గురించి ఇప్పుడొక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు బెస్ట్ పెయిర్‌లు.. నటుడు రామ్ చరణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిసి బాలయ్య అన్‌స్టాపబుల్‌లో కనిపించడానికి అంగీకరించినట్లు అంతర్గత సమాచారం.


ఇదే కనుక నిజమైతే ఆహా యొక్క అన్‌స్టాపబుల్ S2 యొక్క సూపర్ పాపులర్ ఎపిసోడ్‌లలో ఇది ఒకటి అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. ఇప్పటికే తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ కు మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి పలువురు సినీ సెలబ్రెటీలతో స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.


ఇటీవలి ప్రభాస్ ఎపిసోడ్‌లో, బాలయ్య తనను షోకి రావాలని కోరినప్పుడు రామ్ చరణ్.. మీ కాల్ కోసం వెయిటింగ్ అని చెప్పాడు. మరి ఇది త్వరలో నిజం కానున్నట్లు అనిపిస్తోంది. ప్రభాస్‌తో ఎపిసోడ్ పార్ట్ 2 ఉంటుంది. దీనిలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ నటుడు గోపీచంద్ కూడా పొల్గొననున్నారు.



ఇది జనవరి 6న ప్రసారం అవుతుందని ఇప్పటికే షో నిర్వాహకులు తెలియజేశారు. జనవరి 13న వీర సింహా రెడ్డి స్పెషల్ ఎపిసోడ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క భారీ ఎపిసోడ్.. బహుశా సంక్రాతికి పవన్ ఫ్యాన్స్‌కి విందు భోజనం అందించనుందేమో ఆహా టీమ్.

Tags

Read MoreRead Less
Next Story