Keerthy Suresh Natu Steps: మహానటికీ నాటుపాట నచ్చేసింది.. రామ్‌చరణ్‌తో..
Keerthy Suresh Natu Steps: ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ RRR. కోవిడ్ కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ప్రతి ప్రోమో, టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు స్టెప్పులేసిన 'నాటు నాటు ..' పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తారక్-చరణ్ వేసిన స్టెప్పులను అందరూ ట్రై చేస్తూ.. వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హ్యాండ్‌సమ్ హీరో రామ్ చరణ్, క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్ కలిసి నాటుపాటకు స్టెప్పులేస్తే.. వావ్ అద్దిరిపోతుంది కదా.. అదే చేసేసారు కీర్తి నటించిన గుడ్‌లక్ సఖీ ఈవెంట్‌లో.
బుధవారం జరిగిన గుడ్ లక్ సఖి కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజానికి ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ చిరు కరోనా బారిన పడడంతో ఆయనకు బదులు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చారు.
అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్ నటన బాగుందని, 'మహానటి' సినిమా చూసి కీర్తి సురేష్ తో ప్రేమలో పడ్డానని రామ్ చరణ్ అన్నారు. 'గుడ్ లక్ సఖి' చిన్న సినిమా కాదు.. ఒకవైపు మహానటితో జాతీయ అవార్డు అందుకున్న కీర్తిసురేష్ అయితే.. మరోవైపు జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు నగేష్ కుకునూర్ అని రామ్ చరణ్ గుడ్‌లక్ సఖీ టీమ్‌ని అభినందించారు.
అనంతరం వేదికపైకి వచ్చిన కీర్తి సురేష్.. రామ్ చరణ్‌తో కలిసి నాటు స్టెప్ వేయాలన్న కోరికను వెలిబుచ్చింది. దాంతో కీర్తి సురేష్ అంటే నాకు చాలా ఇష్టం. మా మహానటి కోసం నాటు డ్యాన్స్ చేస్తా అని ఆమెతో కలిసి స్టెప్ వేశారు రామ్ చరణ్. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com