Ram Charan : ఆస్ట్రేలియాలో బాడీ బిల్డ్ చేస్తున్న చరణ్​

Ram Charan : ఆస్ట్రేలియాలో బాడీ బిల్డ్ చేస్తున్న చరణ్​

ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా కోసం రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ ఇప్పటికే పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసేందుకు రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే బాడీ ఫిట్ గా ఉంచుకోవాలని భావించి ఆయన అక్కడికి వెళ్లారట.గత మూడు వారాల నుంచి ఆస్ట్రేలియాలోనే రామ్ చరణ్ తేజ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. కాగా.. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు మేకర్స్.

Tags

Next Story