Chiranjeevi B'day: ‘చిరుత’ అంటే చిరంజీవి తాత.. బ్యూటీఫుల్ పిక్ తో తండ్రిని విష్ చేసిన రామ్ చరణ్

Chiranjeevi Bday: ‘చిరుత’ అంటే చిరంజీవి తాత.. బ్యూటీఫుల్ పిక్ తో తండ్రిని విష్ చేసిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ ఫొటోతో విషెస్ తెలిపిన రామ్ చరణ్

ఆగస్టు 22 మంగళవారంతో మెగాస్టార్ చిరంజీవి 68 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి ఈ ప్రత్యేకమైన రోజున, అత్యంత ఆరాధనీయమైన ఫొటోతో శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి తన మనవరాలు క్లిన్ కారా కొణిదెలను పట్టుకొని ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ, రామ్ చరణ్ దానికి క్యాప్షన్ గా "మా ప్రియమైన చిరుత - (చిరంజీవి తాత).. మా తరపు నుంచి, కొణిదెల ఫ్యామిలీ నుంచి అందులోని చిన్న వ్యక్తి నుంచి మీకు ఎంతో ప్రేమను అందిస్తున్నాం" అని రాసుకువచ్చారు. ఈ ఫోటోలో క్లిన్ కారా మోహం కనిపించకుండా ఫేస్‌పై ఎమోజీ పెట్టాడు.

చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా 'Mega156' & 'Mega157' సినిమాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ 156వ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో Mega156 మూవీ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

''4 దశాబ్దాలుగా వెండితెరను శాసించిన లెగసీ! భావోద్వేగాలను రేకెత్తించే వ్యక్తిత్వం! ఆఫ్ స్క్రీన్ లోనూ సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి.. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 సినిమా ఒక మెగా రాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది'' అని మేకర్స్ ట్వీట్ చేశారు. ''ప్రేక్షకులను అలరించే, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం.. ఆన్ స్క్రీన్ బ్రిలియెన్స్ కి, ఆఫ్ స్క్రీన్ మాగ్నానిమిటీకి నిర్వచనంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.

మెగా 157 అప్డేట్..

ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా గురించి తాజాగా అప్డేట్ బయటికొచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ ముందుగా విడుదలయ్యి.. అందులో మరో అప్డేట్ గురించి సమాచారం ఇచ్చారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే చిరు నెక్ట్స్ మూవీ సోషియో ఫ్యాంటసీ జోనర్‌కు సంబంధించిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలావరకు ఈ అనుమానానే నిజమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ‘బింబిసార’ అనే మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వశిష్ట.. రెండో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

Tags

Read MoreRead Less
Next Story