Ram Charan : రామ్ చరణ్ దూకుడు పెంచాలి

Ram Charan : రామ్ చరణ్ దూకుడు పెంచాలి
X
రామ్ చరణ్ దూకుడు పెంచాలంటున్న అభిమానులు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) దూకుడు పెంచాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. ఆ మూవీ తర్వాత స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ ఓ రకంగా చరణ్ ను లాక్ చేసింది. శంకర్ లాంటి డైరెక్టర్ తో చేస్తున్నాడు కదా అనుకుంటే అతనే తీసిన భారతీయుడు 2 రిజల్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అంతా గేమ్ ఛేంజర్ పై ఆశలు వదులుకున్నారు. అంటే ఇక బుచ్చిబాబుతో చేస్తోన్న సినిమానే రామ్ చరణ్ కు హైప్ తెస్తుంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ కూడా హిట్ అయినా.. శంకర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. యేళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న గేమ్ ఛేంజర్ నుంచి చరణ్ బయటపడ్డాడు. రీసెంట్ గానే అతని పోర్షన్ కంప్లీట్ అయింది. అన్నీ కుదిరితే ఈ దసరాకు విడుదల చేయొచ్చు. అయినా ఈ మూవీకి స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత హైప్ ఇప్పుడు అస్సలు లేదు అనేది నిజం.

ఇటు చూస్తే బుచ్చిబాబు మూవీతో దూకుడు పెంచుతాడు అనుకుంటే అదీ అంతంతగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్స్ అంటూ ఏం రాలేదు. జస్ట్ జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం కొంత ఎసెట్ అవుతుంది. అలాగే కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు గతంలోనే చెప్పారు. మరోవైపు అల్లు అర్జున్ తప్ప మిగతా టాప్ తెలుగు స్టార్స్ అంతా ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను వేటాడుతూ దూకుడుగా కనిపిస్తున్న టైమ్ లో రామ్ చరణ్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుండటం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు అంటున్నారు. ఇకనైనా కాస్త దూకుడు పెంచి వరుస మూవీస్ తో మెగా పవర్ ను ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు వీలైనన్ని ఎక్కువ మూవీస్ తో చూపించాలని కోరుకుంటున్నారు. మరి చరణ్ అభిమానుల కోరిక తీరుస్తాడా..? ఇకనైనా బుచ్చిబాబు మూవీ నుంచి ఏదైనా సాలిడ్ అప్డేట్ వస్తుందా అనేది చూడాలి.

Tags

Next Story