Ram charan Tej : ఫిన్‌లాండ్‌లో ఉపాసనతో చరణ్...ఇద్దరూ చిన్న పిల్లలుగా మారి...!

Ram charan Tej : ఫిన్‌లాండ్‌లో ఉపాసనతో చరణ్...ఇద్దరూ చిన్న పిల్లలుగా మారి...!
Ram charan Tej : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన సతీమణి కలిసి ఫిన్‌లాండ్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Ram charan Tej : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన సతీమణి కలిసి ఫిన్‌లాండ్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత మూడేళ్లుగా 'ఆర్.ఆర్.ఆర్', 'ఆచార్య' సినిమాలతో బిజీబిజీగా గడిపేసిన చరణ్.. ఇప్పుడు ఉపాసనతో కలిసి విహారయాత్రకి వెళ్ళాడు.

తమ వయసును తగ్గించుకొని మరి చిన్న పిల్లల లాగా ఆడుతూపాడుతూ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం ఫన్నీగా ఉంది. ఇక మంచు కొండల్లో ఇద్దరూ సరదాగా గడుపుతూ పెట్ డాగ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఉపాసన తన ఇన్‌‌స్టా‌‌గ్రామ్‌‌లో షేర్ చేసింది.

కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చరణ్ నటించిన RRR మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు చరణ్.. దీనికి సర్కారోడు అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఇక తన తండ్రి నటించిన ఆచార్యలో చరణ్ కీ రోల్ ప్లే చేశాడు.

Tags

Next Story