సినిమా

Ram charan Tej : RRR టీమ్‌కు రామ్‌చరణ్‌ 'బంగారు' కానుక

Ram charan Tej : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్..

Ram charan Tej : RRR టీమ్‌కు రామ్‌చరణ్‌ బంగారు కానుక
X

Ram charan Tej : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతూ సంచలనం సృష్టిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 750 కోట్లు వసూళ్ళు సాధించి దూసుకుపోతోంది. ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ బృందాన్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చటించారు.


అనంతరం సుమారు 35 మందికి (స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌, కెమెరా అసిస్టెంట్లు తదితరులు) తులం బంగారు కాయిన్లను (RRR లోగోతో ఉన్న) కానుకగా అందించి అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు.

వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

Next Story

RELATED STORIES