Ram Charan Tej : RC15 నుంచి చరణ్ లుక్ లీక్..!

Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది.. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
సాధారణంగా శంకర్ సినిమా అంటే ఓ ఫ్లాష్‌బ్యాక్ కచ్చితంగా ఉంటుంది.. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. అయితే రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశాడట శంకర్.. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుందట. అయితే ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ తాలూకా లుక్ ఒకటి బయటకు లీక్ అయ్యింది.
ఈ లుక్‌లో చరణ్ పల్లెటూరి కుర్రాడిగా, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో సైకిల్ పై వెళ్తూ కోర మీసాలతో కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ సినిమా కోసం 'సర్కారోడు' అనే టైటిల్‌ను మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ అని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com