Ram Charan Tej : భీమ్లానాయక్ ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ ట్వీట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ మెయిన్ లీడ్‌లో వస్తోన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మూవీ ట్రైలర్‌ని ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్.. ట్రైలర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసింది.
పవన్ కల్యాణ్, రానా మధ్య సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తమన్ మ్యూజిక్‌తోపాటు పవన్‌కల్యాణ్, రానా యాక్టింగ్ సూపర్బ్అనిపించాయి. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ ట్రైలర్. కాగా చిత్ర ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ లో స్పందించాడు.
'భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. పవన్ కల్యాణ్ గారి ప్రతీ డైలాగ్, యాక్షన్ పవర్‌ఫుల్ గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్‌గా ఉంది. త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, నిత్యామీనన్, సితార ఎంటర్టైన్మెంట్స్, తమన్‌కు ఆల్‌ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశాడు రామ్ చరణ్.. కాగా ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (బుధవారం) హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్‌లో జరగనుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారు.
The trailer of #BheemlaNayak is electrifying!!
— Ram Charan (@AlwaysRamCharan) February 22, 2022
Every dialogue & action of @PawanKalyan Garu was"POWERFUL"
My buddy @RanaDaggubati's performance & presence was top notch 👌#BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ALL THE BEST!!👍
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com