Ram Charan: మెగా హీరో మెర్సిడెస్ బెంజ్.. చాలా కాస్ల్టీ గురూ..

Ram Charan: మెగా హీరో మెర్సిడెస్ బెంజ్.. చాలా కాస్ల్టీ గురూ..
సినీ తారలకు కార్లపై మక్కువ ఎక్కువ. కారు ఎంత కాస్ట్లీ అయినా తమ గ్యారేజీలో ఉండాల్సిందే.. తాజాగా మెగా హీరో రామ్ చరణ్

Ram Charan: సినీ తారలకు కార్లపై మక్కువ ఎక్కువ. కారు ఎంత కాస్ట్లీ అయినా తమ గ్యారేజీలో ఉండాల్సిందే.. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ న్యూ బ్రాడ్ బ్రెంజ్ లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారును చరణ్ తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడట. ఈ కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600. కొద్ది సేపటి క్రితమే డెలివరీ కావడంతో చరణ్ దాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం తన టీంతో కలిసి ఓపెన్ చేసిన చరణ్ కొత్త బ్లాక్ కలర్ బెంజ్ కారులోనే ఇంటికి వెళ్లారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ.2.5 కోట్లనుంచి 3 కోట్ల వరకు ఉంటుందట. అయితే చెర్రీ గ్యారేజీలో ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూతో పాటు ఖరీదైన మరి కొన్ని కార్లు కూడా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS ఆటోమేటిక్ పెట్రోల్ కారు. GLS 600 అనేది మెర్సిడెస్-మేబాచ్ బ్రాండ్ లేబుల్ నుండి వచ్చిన మొదటి SUV. దాదాపు 3 కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారుని సినీ ప్రముఖులు చాలా మంది తీసుకున్నారు.

బాలీవుడ్‌లో అర్జున్ కపూర్ ఈ మేబాక్‌ను మొదట కొనుగోలు చేయగా, రణవీర్ సింగ్ ఆపై కృతి సనన్ కూడా ఈ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ప్రారంభించిన మొదటి 50-75 మేబాచ్ యూనిట్‌లు ఎక్కువగా సినిమా తారల ద్వారా మాత్రమే బుక్ చేయబడుతున్నాయి. ఈ విలాసవంతమైన కారును కొనుగోలు చేసేందుకు సినీ తారలు ముచ్చటపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story