Ram Charan TruJet: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదంటూ..

Ram Charan (tv5news.in)

Ram Charan (tv5news.in)

Ram Charan TruJet: రామ్ చరణ్, తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించాడు.

Ram Charan TruJet: మామూలుగా సినిమాల్లో కాస్త పేరు, గుర్తింపు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే డబ్బును మరోచోట పెట్టుబడిగా పెట్టడం చాలామంది నటీనటులకు అలవాటే. అయితే ఇటు ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే.. బిజినెస్‌ను కూడా సమానంగా చూసుకుంటూ లాభాలు వెనకేసుకున్న వారు చాలామందే ఉన్నారు. అంతే కాకుండా నష్టాలు చవిచూసిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ మొదలుపెట్టిన ఓ బిజినెస్ నష్టాల్లో ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

రామ్ చరణ్, తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించాడు. ట్రూ జెట్ పేరుతో దీని విమాన సేవలు 2015లో ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ట్రూ జెట్ విమాన సంస్ధ లాభాల్లోనే నడిచింది కానీ గతకొంతకాలంగా నష్టాలను ఎదుర్కుంటుంది అని వార్తలు వస్తున్నాయి. దీనిపై ట్రూ జెట్ యాజమాన్యం స్పందించింది.


'ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులోని ఏ ఒక్కదానిలో కూడా నిజం లేదు. ఇది కేవలం కంపెనీ పేరును చెడగొట్టడానికే. సీఎఫ్ఓ కేజీ విశ్వనాథ్, సీసీఓ సుధీర్ రాఘవన్ కంపెనీని వదిలేసి వెళ్లి దాదాపు సంవత్సరం అయ్యింది. త్వరలోనే కంపెనీకి 25 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ రానున్నాడు. దానికి సంబంధించిన చర్చలు చివరిదశకు చేరుకున్నాయి.'

'ప్రస్తుతానికి ట్రూ జెట్ సేవలు పలు కారణాల వల్ల నిలిచిపోయాయి. 2021 నవంబర్ నుండి ట్రూ జెట్ సంస్థ వారి ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు సగం జీతం అందుతోంది. తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తి జీతం అందుతోంది. మళ్లీ కష్టపడి ట్రూ జెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. మరిన్ని విమానాలతో ఆకాశాన్ని తాకుతుంది.' అని ట్రూ జెట్ సంస్థ తమ ట్విటర్ ద్వారా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story