Ram Charan: మెగా ప్రిన్సెస్ కు నామకరణం... ఆనందంలో చిరు ఫ్యామిలీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనా దంపతుల కుమార్తెకు నామకరణం చేయనున్నారు. ఈనెల 20న ఆడబిడ్డకు జన్మనివ్వగా మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 20న మెగా ప్రిన్సెస్ జన్మించగా ఈరోజు (జూన్ 30న) స్వగృహంలో బిడ్డకు పేరుపెట్టనున్నారు. ఈ వేడుకకు పలువురు పెద్దలు, సినీ ప్రముఖులు హాజరవనున్నట్లు తెలుస్తోంది.
ఈనెల అపోలో హాస్పిటల్ లో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో బిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన. జూన్ 20న అమ్మాయి జన్మించగా... జూన్ 23న కూతురును ఇంటికి తీసుకెళ్లారు. మొదటిసారి బిడ్డను మీడియాముందుకు తీసుకొచ్చిన చరణ్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అచ్చం తన లాగే ఉందని మురిసిపోయాడు చరణ్.
ఇప్పటికే చరణ్ దంపతులు బిడ్డపేరును ఎంచుకున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని స్వగృహంలో సాంప్రదాయ పద్దతిలో అమ్మాయికి నామకరణం చేయనున్నట్లు తెలిపారు. ఊయల వేడుకకు సిద్దమైన రెండు వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ విడియోలలో వారి నివాసం వద్ద వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంగారం-తెలుపు రంగుల కలయికతో వేదికను అలంకరిస్తున్నారు.
"మా చిన్నారికి లభించిన ఆత్మీయ స్వాగతంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాము. అందరి ప్రేమ, ఆశీర్వాదాలు లభించినందుకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు ఉపాసన.
చరణ్ ఉపాసనలకు వివాహమైన 11 సంవత్సరాలకు బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. చిన్నారి జన్మించిన రోజు మెగా స్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. చరణ్ ఆనందానికైతే అవధులు లేకుండా పోయింది. మొదటిసారి తండ్రైన ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రోజు చిన్నారికి నామకణం చేసే వేడుకకు కొనిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు సన్నిహితులు, బందువులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com