Ram Charan: స్టైలింగ్ టీమ్‌కే అంత రెమ్యునరేషనా..? రామ్ చరణ్ కొత్త లుక్‌పై అప్పుడే పెరిగిన అంచనాలు..

Ram Charan (tv5news.in)
Ram Charan: సినిమా వారు ఎక్కువకాలం ఇండస్ట్రీలో వెలగాలంటే ఎప్పటికప్పుడు అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తుండాలి. ఇది హీరోయిన్లకు మాత్రమే కాదు హీరోలకు కూడా వర్తిస్తుంది. హీరోలు కూడా స్టైలిష్‌గా, ఫిట్‌గా ఉండడానికి చాలానే కష్టపడుతుంటారు. పర్ఫెక్ట్ డైట్ మెయింటెయిన్ చేస్తే తప్ప వారికి ఆ ఫిజిక్ రాదు. అంతే కాదు ఎక్స్పర్ట్స్ సాయం లేకుండా అంత స్టైల్‌గా కూడా ఉండలేరు. తన అప్‌కమింగ్ సినిమాలో స్టైలిష్‌గా కనిపించడానికి రామ్ చరణ్ చాలానే కష్టపడుతున్నాడని టాక్.
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత తమిళ దర్శకుడు శంకర్‌తో కలిసి పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎలాగో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యింది కాబట్టి త్వరలోనే శంకర్ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాలని రామ్ చరణ్ అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు చివరిదశకు చేరుకున్నాయి.
శంకర్ సినిమాలో రామ్ చరణ్ ముందెన్నడూ లేని స్టైలిష్ లుక్‌లో కనిపించడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికోసమే ముంబాయ్ నుండి ఓ స్టైలింగ్ టీమ్‌ను రంగంలోకి దించనున్నారట. అయితే వీరి రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టీమ్ అందరు ఒక్కరోజుకు లక్షన్నర నుండి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారట.
బడ్జెట్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వని శంకర్.. ఆ స్టైలింగ్ టీమ్‌కు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదట. అంతే కాకుండా వీరు ముంబాయ్ నుండి రావడానికి బిజినెస్ క్లాస్ ఫ్లైట్, ఇక్కడ స్టార్ హోటల్‌లో రూమ్ కూడా బుక్ చేశారట. ఇక ఈ సినిమా అయ్యేలోపు వారికి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com