11 Jan 2022 5:34 AM GMT

Home
 / 
సినిమా / Ram Charan: కథ...

Ram Charan: కథ నచ్చింది.. ఆ దర్శకుడితో సినిమా ఓకే అయ్యింది..

Ram Charan: ఆర్ఆర్ఆర్ విడుదల గురించి టెన్షన్ పడకుండా చరణ్.. శంకర్ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టేశాడు.

Ram Charan (tv5news.in)
X

Ram Charan (tv5news.in)

Ram Charan: ప్రస్తుతం కథ నచ్చితే చాలు.. ఒక భాషలోని దర్శకుడు.. మరో భాషలోని హీరోతో చేయి కలపడానికి కూడా ఓకే అనుకుంటున్నారు. ఆ ఫార్ములానే రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నాడు. చాలాకాలంగా కేవలం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. మధ్యమధ్యలో కొరటాల శివ తెరకెక్కించే 'ఆచార్య' షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఇక వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న చరణ్.. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట.

'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇద్దామనుకున్న రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురయ్యింది. ఇక ఫైనల్‌గా జనవరి 7న ఆర్ఆర్ఆర్ వస్తుందనుకుంటే అది కూడా పోస్ట్‌‌పోన్ అయ్యింది. దీంతో ఆర్ఆర్ఆర్ విడుదల గురించి టెన్షన్ పడకుండా చరణ్.. శంకర్ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టేశాడు. అది మాత్రమే కాకుండా ఇంకా చరణ్ చేతిలో మరో సినిమా కూడా ఉంది.

కోలీవుడ్ నుండి శంకర్‌తో సినిమా పూర్తయ్యాక మళ్లీ టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితోనే సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. 'జెర్సీ'తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్.. రామ్ చరణ్‌కు కథ వినిపించడం, అది ఓకే అవ్వడం కూడా జరిగిపోయింది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత చరణ్.. మరో యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సాంకిృత్యాన్.. శ్యామ్ సింగరాయ్‌తో తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. పూనర్జన్మ కథాంశంతో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ కథ.. రామ్ చరణ్‌ను విశేషంగా ఆకట్టుకుందట. ఇదే విషయాన్ని చరణ్ కూడా తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అయితే సరైన కథ కుదిరితే.. రాహుల్‌తో వర్క్ చేయడానికి చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం.

Next Story