Ram Charan , NTR : ఎన్టీఆర్ కి ఆల్ ద బెస్ట్ చెప్పిన రామ్ చరణ్

అడ్డగోలుగా కనిపిస్తోన్న ఫ్యాన్ వార్ కు ఎండ్ కార్డ్ వేశాడు రామ్ చరణ్. కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో మాకేం పనిలేదు అని డిక్లేర్ చేశాడు చరణ్. శుక్రవారం విడుదలవుతున్న ‘ఎంటైర్ దేవర టీమ్ తో పాటు నా సోదరుడు ఎన్టీఆర్ కు ఆల్ ద బెస్ట్..’ అని చెప్పాడు. నిజానికి ఇది ఊహించిందే. తారక్, చరణ్ ఆర్ఆర్ఆర్ నుంచి అత్యంత అభిమానంగా ఉంటున్నారు. ఆ మూవీలో వీరి బాండింగ్, ప్రమోషన్స్ టైమ్ లో ఫ్రెండ్షిప్ చూసి చాలామంది ముచ్చట పడ్డారు.
కానీ అభిమానులు మాత్రం ఆర్ఆర్ఆర్ లో అసలు హీరో ఎవరు.. సైడ్ యాక్టర్ ఎవరూ అంటూ రచ్చకు తెర లేపారు. దేవర మూవీ విడుదల టైమ్ లో కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య అదే పనిగా సోషల్ మీడియా వార్ జరిగింది. దీనికి ఎండ్ కార్డ్ వేయాలని నిర్మాత నాగవంశీ చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోలతో పాటు రికార్డులు, రివార్డులు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా మధ్యలో దూరిపోయి అసహ్యకరమైన మీమ్స్, ట్రోల్స్ తో రచ్చ రచ్చ చేసుకున్నారు. సో.. ఇలాంటి చీప్ ఫ్యాన్స్ చేసే చేష్టలతో మాకు ఏ సంబంధం లేదని రామ్ చరణ్ చాలా హుందాగా ప్రవర్తించాడు. సో.. దేవరపై ఇకనైనా ట్రోల్స్ ఆగుతాయోమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com