Ram Charan : రామ్ చరణ్.. సుకుమార్ ను పక్కన పెట్టాడా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ తర్వాత చేయబోయే సినిమా అని సుకుమార్ దే అని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య వచ్చిన, వస్తోన్న అప్డేట్స్ చూస్తుంటే అతను సుకుమార్ మూవీని లైట్ తీసుకోబోతున్నాడు లేదంటే కాస్త ఆలస్యంగా చేయబోతున్నాడు అని వినిపిస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటీ అంటే రామ్ చరణ్ ఇమ్మీడియొట్ గా చేయబోయే సినిమా సంజయ్ లీలా భన్సాలీది అని. యస్.. సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ ఓ భారీ సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంజయ్ దర్శకుడు కాదు. కేవలం నిర్మాత మాత్రమే. అలాగే ఇప్పటికే ఈ మూవీ కథ, కథనాలన్నీ రెడీ అయ్యాయని.. రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇదో యాక్షన్ అడ్వెంచరస్, పీరియాడికల్ డ్రామా అని చెబుతున్నారు. ఇందులో భారీ ఛేజ్ లు, గుర్రాలతో స్వారీలు ఉండబోతున్నాయి అంటున్నారు. కాకపోతే ప్రస్తుతానికి ఇది ఓ రూమర్ గా మాత్రమే వినిపిస్తోంది. ఈ వార్తలో ఇప్పటికైతే నిజం లేదు అనే టాక్ ఉంది. కాకపోతే సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ మూవీ ఖచ్చితంగా ఉండబోతోంది అని కూడా తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ అంటే మాటలు కాదు. అతను డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ క్లాసిక్స్ గానే ఉంటాయి. అద్భుతమైన దర్శకుడు అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. అలాంటి దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ మరో దర్శకుడికి ఇవ్వబోతున్నాడు అనే మాటలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ కాంబినేషన్ నిజంగా వర్కవుట్ అయితే మాత్రం రామ్ చరణ్ కు ఇదో బిగ్ చాలెంజ్ అనేది మాత్రం వాస్తవం. అదే నిజమైతే సుకుమార్ మూవీ సైడ్ అయినట్టే అని కూడా చెప్పొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
