Ram Charan : వయెలెంట్ డైరెక్టర్ తో రామ్ చరణ్ ..?

Ram Charan :  వయెలెంట్ డైరెక్టర్ తో రామ్ చరణ్ ..?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి క్రేజీ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చల దశలోనే ఉందట ఈ ప్రాజెక్ట్. అయినా.. ఆ దర్శకుడి గురించి తెలిస్తే అమ్మో అనేస్తారు ఫ్యాన్స్. కాకపోతే అతను చెయ్యాలనుకుంటున్నది అంతా అనుకునే టైప్ మూవీ కాదని టాక్. ప్రస్తుతం బుచ్చిబాబుతో క్రికెట్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు తదతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ. 2025 దసరా రిలీజ్ టార్గెట్ గా శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు తర్వాత సుకుమార్ తో మూవీ అఫీషియల్ గానే కన్ఫార్మ్ అయింది. మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే ఈ చిత్రం ఉండబోతోంది. రంగస్థలం తర్వాత ఇద్దరూ కలిసి చేసే సినిమా ఇది. పైగా ఇప్పుడు ఇద్దరికీ ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ మూవీతో పాటు లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఆ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. రీసెంట్ గా ‘కిల్’మూవీతో మోస్ట్ వయొలెంట్ మూవీ అందించాడు. స్టార్ కాస్ట్ లేకున్నా ఈ చిత్రం గురించి ఇండియా అంతా మాట్లాడుకుంది. ఆ స్థాయి ఈ దర్శకుడిలో ఉంది.

అయితే నిఖిల్.. రామ్ చరణ్ తో చేయాలనుకుంటోంది ఓ మైథలాజికల్ ఫిల్మ్ ట. పైగా అర్జునుడి కథగా ఉండే అవకాశం ఉందనే లీక్స్ బాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ ప్రాజక్ట్ గురించి ఆరు నెలలుగా మంతనాలు సాగుతున్నాయట. మధు మంతెన నిర్మిస్తాడు అంటున్నారు. ఇప్పటికే ప్రీ విజువలైజేషన్ వర్క్ కూడా పూర్తి చేశారంటున్నారు. రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడంటున్నారు. అయితే అటు దర్శకుడు నిఖిల్ కు ఆల్రెడీ వేరే కమిట్మెంట్ ఉంది. ఇటు చరణ్ సుకుమార్ మూవీ చేయాల్సి ఉంది. ఈ రెండూ పూర్తయ్యాక లేదా ఈ యేడాది చివర్లో ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకశాలున్నాయంటున్నారు.

Tags

Next Story