Game Changer : రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు విడుతలై గండం

Game Changer : రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు విడుతలై గండం
X

డైరెక్టర్ శంకర్, మెగా హీరో రాంచరణ్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ డిసెంబర్ 20న విడుదల కానుందని తెలుస్తోంది. అదే రోజున మెట్రిమారన్ విడుతలై 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా పార్ట్ 1కి మంచి టాక్ రావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తే తమిళనా డులో చెర్రీ మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. గేమ్ చేంజర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో అంజలి కీలక పాత్రలో కనిపించనుం ది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే క్లారిటీ పచ్చింది. అయితే తేదీలు మార్చుకుంటారా..? లేదా అన్నది క్లారిటీ లేదు. గతేడాది విడుదలైన బ్లాక్బస్టర్ హిట్ మూవీ విడుదల 1 కు సీక్వెల్ తీసిన సినిమా విడుతలై - 2. విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు వెర్షన్ విడుదల-2గా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీక్వెల్లో అనురాగ్ కశ్యప్, గౌతమ్ వాసు దేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, రాజీవ్ మీనన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags

Next Story