Ram Charan : ఆరెంజ్ మళ్లీ వస్తోంది

Ram Charan :  ఆరెంజ్ మళ్లీ వస్తోంది
X

ఆరెంజ్.. రామ్ చరణ్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ. 2010లో విడుదలైన ఆరెంజ్ రిలీజ్ టైమ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన నాగబాబు వీధుల్లో పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అన్నట్టుగా ఉంది అప్పుడు నా పరిస్థితి అని అతను చాలాసార్లు చెప్పుకున్నాడు కూడా. ఆ రేంజ్ డిజాస్టర్ అన్నమాట. ప్రేమ, ప్రేమికుడిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ సినిమా అప్పుడు జనాలకు పెద్దగా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అదో క్లాసిక్ గా కనిపిస్తోంది జనాలకు. సినిమా వచ్చిన చాలా రోజులకు కానీ ఆ కంటెంట్ అర్థం కాలేదు. ముఖ్యంగా హారిస్ జయరాజ్ మ్యూజిక్, పాటలు ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ఈ చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు, రామ్ చరణ్ కు ఇది మూడో సినిమా కావడం విశేషం.

ఫస్ట్ మూవీ బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ పరుగుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటు రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత తర్వాత మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అలాగే బొమ్మరిల్లులో హాసినిగా అందరి మనసులూ దోచుకున్న జెనీలియా హీరోయిన్. అందుకే ఆరెంజ్ పై భారీ అంచనాలున్నాయి. మగధీర ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఆరెంజ్ ఉండటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. పూర్తిగా ఓ క్లాసిక్ లవ్ స్టోరీ లాగా కనిపించే సరికి కాస్త డిజప్పాయింట్ అయ్యారు. మగధీర లాంటి మాస్ మూవీ తర్వాత మరీ ఇంత క్లాస్ ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ కారణంగా ఆరెంజ్ అంత పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు వచ్చి ఉంటే బావుండేది అని భావించే ప్రేక్షకులు చాలా ఎక్కువమంది ఉన్నారు. వారి కోసమే ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. యస్ ఆరెంజ్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోందీ మూవీ.అప్పుడు అర్థం చేసుకోలేకపోయిన వాళ్లు, మిస్ అయిన వాళ్లు మళ్లీ చూస్తే ఆరెంజ్ లో నిజంగా అంత గొప్ప కథ ఏం ఉంది అనేది ఇప్పటికైనా తెలుస్తుందేమో.. లేదా మళ్లీ అప్పటి టాకే వస్తుందేమో కానీ.. ఎన్నాళ్లుగానో ఈ చిత్రం కోసం ఎదురుచూస్తోన్న వారికి మాత్రం ఇది బిగ్ న్యూస్.

Tags

Next Story