Ram Gopal Varma: అక్కినేని ఫ్యామిలీ vs ఆర్‌జీవి.. అప్పుడు సుమంత్ ను.. ఇప్పుడు చైతూను..

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదని కొందరు అంటారు. కానీ ఆయన ఏం మాట్లాడిన కరెక్ట్‌గా మాట్లాడతాడని మరికొందరు అంటారు. అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాతో దర్శకుడిగా మారిన ఆర్‌జీవీ నిత్యం ఆ కుటుంబంతో ఏదో ఒక వివాదానికి దిగుతూనే ఉంటాడు. ఇదివరకు సుమంత్, ఇప్పుడు నాగచైతన్య.. వీరి వ్యక్తిగత జీవితంపై ఆర్‌జీవీ చేసిన కామెంట్లు చాలా కాంట్రవర్సీకే దారితీస్తున్నాయి.
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సుమంత్. అయితే తన కెరీర్ మొదట్లోనే హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లాడిన సుమంత్‌కు మ్యారీడ్ లైఫ్ అంతగా కలిసి రాలేదు. అందుకే విడాకులు తీసుకొని ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. తాజాగా తాను నటిస్తున్న తరువాతి చిత్రం నుండి ఒక పెళ్లి కార్డ్ ఫోటో వైరల్‌గా మారింది. అది సినిమా ప్రమోషన్ అని తెలియక ఆర్‌జీవీ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడేమో అని అపోహ పడ్డాడు.
దీంతో ఒక్కసారి పెళ్లిలో దెబ్బతిన్నా బుద్ధి రాలేదా అంటూ సుమంత్‌ను ఉద్దేశించి ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు కూడా చైతూ, సమంతల విడాకుల విషయాన్ని అనౌన్స్ చేయగానే అరడజను ట్వీట్లతో ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అని అన్నాడు. తనను డైరెక్టర్‌గా నిలబెట్టిన అక్కినేని ఫ్యామిలీతో ఆర్‌జీవికి ఈ వివాదాలు ఏంటో అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com