RGV : ఆ రెండు చిత్రాలే సంతృప్తినిచ్చాయి : ఆర్జీవీ

RGV : ఆ రెండు చిత్రాలే సంతృప్తినిచ్చాయి : ఆర్జీవీ
RGV : ఆర్జీవీ ఆర్ఆర్ఆర్ చిత్రంపై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సర్కస్‌తో పోల్చారు.

RGV : ఆర్జీవీ ఆర్ఆర్ఆర్ చిత్రంపై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సర్కస్‌తో పోల్చారు. రాజమౌలి త్రిబుల్ ఆర్ చిత్రాన్ని నేను ఎంజాయ్ చేశాను కానీ బ్రిడ్జ్ సీన్‌లో పిల్లాడిని కాపేడేప్పుడు జెమినీ సర్కస్ చూస్తున్న అనుభవం కలిగిందన్నారు ఆర్జీజీ. నా సినిమాలు మణిరత్నంకు నచ్చవు.. మణిరత్నం మూవీస్ నాకు నచ్చవన్నారు.

కాలేజీ చదివే రోజుల్లో తాను కమ్యునిస్టు భావజాలంతో ఉండేవాడినని.. అయాన్ ర్యాండ్ పుస్తకాలు చదివిన తరువాత పూర్తిగా మారిపోయానన్నారు. తన ఫిలిం కెరీర్‌లో సంతృప్తినిచ్చిన చిత్రాలు.. క్షణక్షణం, సర్కార్ అని చెప్పారు. నాకు సినిమాలు చూడడం, చేయడంలో ఎప్పుడూ బోర్ కొట్టదు. నేను ఏ విషయాలను అంత సీరియస్‌గా తీసుకోను. తనకన్నా అందంగా అమ్మాయిల్ని ఎవరూ చూపించలేరన్నారు. ఫెమినిజం అంటే స్త్రీలకోసం పోరాడటం కాదని.. స్త్రీలను ప్రేమించడం అని ఆర్జీవి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story