Ram Gopal Varma : బాలీవుడ్ ని మళ్ళీ టార్గెట్ చేసిన వర్మ..!

Ram Gopal Varma : బాలీవుడ్ ని వర్మ మళ్ళీ టార్గెట్ చేశాడు.. పుష్ప, RRR, KGF 2 చిత్రాల రిలీజ్ అప్పటినుంచి బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా... "థియేటర్లలో సౌత్ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం, బాలీవుడ్ సినిమాలు డీలా పడటం చూస్తుంటే.. త్వరలోనే బాలీవుడ్ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయి" అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.. ఇటీవల జాతీయ బాష పైన సుదీప్, అజయ్ దేవగన్ ల మధ్య ట్వీట్ వార్ జరగడం, బాలీవుడ్ ఎంట్రీ పైన మహేష్ బాబు స్పందించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో బాలీవుడ్ పైన వర్మ ఇలా కామెంట్స్ చేయడం మరో కొత్త చర్చకి దారి తీశాయి.
The way SOUTH films seem to be going in theatres and NORTH films don't seem to be going, it looks like BOLLYWOOD should be soon making films only for OTT 😳
— Ram Gopal Varma (@RGVzoomin) May 13, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com