17 April 2022 9:45 AM GMT

Home
 / 
సినిమా / Ram Gopal Varma : ...

Ram Gopal Varma : చిరు-చెర్రీ వీడియోపై వర్మ కామెంట్స్..!

Ram Gopal Varma : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఆచార్య... ఇందులో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Ram Gopal Varma :  చిరు-చెర్రీ వీడియోపై వర్మ కామెంట్స్..!
X

Ram Gopal Varma : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఆచార్య... ఇందులో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌.. తాజాగా ఈ సినిమాలోని 'భలే భలే బంజారా'సాంగ్‌ విడుదల తేదిని ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో నువ్వు నన్ను డామినేట్ చేస్తావా అంటూ చిరు- చరణ్ మధ్య జరిగిన సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'నేను బాగా హర్ట్‌ అయ్యారు. వాళిద్దరు సినిమా గురించి మాట్లాడుతూ తగ్గను తగ్గెదేలే.. అని అల్లు అర్జున్‌ డైలాగులు వాడటం చేస్తుంటే బన్నీ న్యూ మెగా హీరో అని చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది' అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు.


Next Story