Ram Gopal Varma: వైసీపీ పాలన నచ్చలేదని ఓటేసిన వాళ్లు అడిగితే దిగిపోతారా: ఆర్జీవీ

Ram Gopal Varma: ఏపీలో టికెట్ రేట్లపై మంత్రి పేర్ని నానికి వరుస ప్రశ్నలు సంధించారు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వండి అంటూ వరుస ట్వీట్స్ చేశారు. పేదలకు సినిమా చాలా అవసరమని ఏపీ ప్రభుత్వానికి అనిపిస్తే పేదలకు రాయితీ ఇవ్వొచ్చు కదా అని ఓ సవాల్ విసిరారు.
పేదలకు బియ్యం, పంచదార, గోధుమలు, కిరోసిన్ అందించడానికి రేషన్ షాపులు ఉన్నట్టే.. రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా అని ఆర్జీవీ ప్రశ్నించారు. సినిమా సహా ఏదైనా ప్రాడక్ట్‌కి ధర నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఎంత అని ప్రశ్నించారు.
వైసీపీకి అధికారం ఇచ్చింది తమ తలపై కూర్చోవడానికి కాదని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని వర్మ కౌంటర్ వేశారు.
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల రెమ్యూనరేషన్ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపైనే ఉంటుందని, దీన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారని, ప్రోత్సాహం కోల్పోతే నాణ్యతా లోపం తలెత్తుతుందని, అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికీ వర్తిస్తుందని సలహా ఇచ్చారు.
టమాటాలు బాగోలేకపోతే షాపు వాళ్లు తిరిగి డబ్బులు ఇవ్వడమో, వేరే టమాటోలు ఇవ్వడమో చేస్తారని మంత్రి పేర్ని నాని ఓ ఉదాహరణ చెప్పారు. దీనికి కూడా వర్మ కౌంటర్ ఇచ్చారు. టామాటో తిన్న తరువాత.. రుచి బాగోలేదు డబ్బులు ఇవ్వండని అడిగితే ఎంత చెండాలంగా ఉంటుందో.. సినిమా బాగోలేదు, డబ్బులివ్వండని అడగడం కూడా అలాగే ఉంటుందన్నారు.
టికెట్ రేట్ల వివాదానికి ఆర్జీవీ ఓ పరిష్కారం కూడా చూపించారు. నిర్మాతలు వారి ధరకు టిక్కెట్లను విక్రయిస్తారు, ప్రభుత్వం ఆ టిక్కెట్‌లను స్వయంగా కొని పేదలకు తక్కువ ధరలకు అమ్మొచ్చు అని, ఆ విధంగా తాము డబ్బు సంపాదించుకుంటాం, మీరు మీ ఓట్లు పొందండి అంటూ వరుస ట్వీట్స్ చేశారు.
ఇండస్ట్రీ పెద్దలకు సైతం చురకలు అంటించారు రామ్‌గోపాల్‌వర్మ. ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పుడూ తిరగలేని పరిస్థితి వస్తుంది, తర్వాత మీ కర్మ అంటూ ట్వీట్ చేశారు. భయాన్ని వీడి మనసులో అభిప్రాయాల్ని చెప్పాలని పిలుపునిచ్చారు వర్మ.
వైసీపీకి అధికారం ఇచ్చింది తమ నెత్తిపై కూర్చోవడానికి కాదు
సంచలన ట్వీట్స్‌తో ఏపీ మంత్రులకు ప్రశ్నలు సంధిస్తున్న వర్మ
సినిమా నచ్చకపోతే డబ్బులిచ్చేస్తారా అని ప్రశ్నించారు..
వైసీపీ పాలన నచ్చలేదని ఓటేసిన వాళ్లు అడిగితే దిగిపోతారా?
టికెట్ రేట్లపై మంత్రి పేర్ని నాని సహా మంత్రులకు వరుస ప్రశ్నలు
పేదలకు సినిమా అవసరమని భావిస్తే.. పేదలకు రాయితీ ఇవ్వొచ్చు కదా?
పేదల కోసం రేషన్ షాపులు ఉన్నట్టే.. రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా?
నిర్మాతలు వారి ధరకు టిక్కెట్లను విక్రయిస్తారు..
ప్రభుత్వం టిక్కెట్లు కొని పేదలకు తక్కువ ధరలకు అమ్మండి
అలా మేం డబ్బు సంపాదించుకుంటాం, మీరు ఓట్లు పొందండి అంటూ ట్వీట్స్
సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఎంత?
స్టార్ హీరోల రెమ్యూనరేషన్ సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపై ఉంటుంది
ఈ విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలని హితవు
ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే.. రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు
ప్రోత్సాహం కోల్పోతే నాణ్యతా లోపం తలెత్తుతుంది
అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికీ వర్తిస్తుందని చురక
టమాటో తిని రుచి బాగోలేదు, డబ్బులివ్వండని అడిగితే ఎలా ఉంటుంది?
సినిమా చూసి, బాగోలేదు డబ్బులివ్వండని అడగడం కూడా అలాగే ఉంటుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com