RGV Tweet Viral: బీఆర్ఎస్‌ పార్టీపై వర్మ కామెంట్ వైరల్..

RGV Tweet Viral: బీఆర్ఎస్‌ పార్టీపై వర్మ కామెంట్ వైరల్..
RGV Tweet Viral:

RGV Tweet Viral: ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆదిపురుష్ వినిపిస్తోంది. టీజర్ విడుదల తరువాత పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టీజర్‌లో హిందూ దేవతలను దర్శకుడు ఓం రౌత్ తప్పుగా చూపించాడంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాముడి క్యారెక్టర్‌ పైనా విమర్శలు చేస్తున్నారు..అసలు ప్రభాస్‌ త్రీడీ యానిమేషన్ మూవీ చేయడం ఏంటని..? బాహుబలి మూవీ చేసినట్లు ఈ ప్రాజెక్ట్ చేయచ్చు కదా అంటూ టార్గెట్‌ చేస్తున్నారు. ఇక హనుమంతుడు లెదర్ వేసుకున్నట్లు చూపడంపై మండిపడుతున్నారు. మరోవైపు ట్రోల్స్ వస్తున్నా ఆదిపురుష్ టీజర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. 24 గంటట్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు సాధించింది.

క్రేజీ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కారు టాలీవుడ్‌ సన్సెషనల్‌ డైరకట్ర్‌ రాంగోపాల్‌ వర్మ. ఎప్పుడు ట్విట్టర్‌‌లో ఏదో ఓ ట్వీట్‌ చేస్తూ వర్మ అందరికీ షాక్‌ ఇస్తుంటాడు. పొలిటికల్‌ అంశాలపైన కూడా స్పందించే వర్మ లేటెస్ట్‌ గా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపైనా రియాక్ట్ అయ్యాడు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యారంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ అడుగుపెడుతున్నందుకు స్వాగతం పలికాడు. అయితే కేసీఆర్‌ను వర్మ ఆదిపురుష్ అనడంతో కొందరు నెటిజన్‌లు ఇది పొగడ్త లేదా విమర్శ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

త్రీడీ యానిమేషన్ లో ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ తో ఈ ఆదిపురుష్ ను ఎందుకు రూపొందించాలని భావించారో కూడా అర్థం కావడం లేదని. ఆ మోషన్ క్యాప్చర్ బదులుగా యాక్టర్స్‌తో మూవీ తీయోచ్చు కదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మన దేశంలో ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ టెక్నిక్ తో తొలిసారి రూపొందిన చిత్రం రజనీకాంత్ 'కొచడయ్యాన్. ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.

మరోవైపు శివభక్తుడు, బ్రాహ్మణుడైన రావణుడు 64 కళల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తి. వైకుంఠాన్ని కాపలా కాసిన జయుడు శాపం పొంది భూలోకంలో రావణునిగా పుట్టారు. ఈ సినిమాలో రావణుడి చిత్రీకరణ ఓ నియంతను తలపిస్తోంది కానీ, రావణుడిని కాదు. బాలీవుడ్ రామాయణాన్ని, చరిత్రను వక్రీకరించడం ఆపండి. అంటూ బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కళాత్మకంగా ఉండే పుష్పక విమానాన్ని కూడా భయంకరమైన గద్దలా చూపించారని కొంతమంది ట్రోల్‌ చేస్తున్నారు.

ఇది చాలా నిరుత్సాహకరంగా ఉంది. ఇదొక రూ. 500 కోట్ల కార్టూన్ సినిమాలా ఉంది. రావణాసురుడు దారుణంగా కనిపిస్తున్నారు. ప్రభాస్ యానిమేటెడ్ హాస్యం మాదిరిగా కాకుండా బాహుబలి తరహాలో కనిపించి ఉంటే బాగుండేది అని మరొక యూజర్ ట్వీట్ చేశారు. రామాయణంలో హనుమంతుడు ఆదిపురుష్‌లో ముస్లిం" అంటూ నార్బర్ట్ ఎలెక్స్ అనే వ్యక్తి ట్వీట్ చేసారు. హిందువులెవరూ మీసం లేకుండా గెడ్డం పెంచుకోరు అని అన్నారు.

క్రేజీ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కిన ఆర్జీవీ

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్

అంటూ ఆర్జీవీ ట్వీట్

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్‌ను ..

స్వాగతించిన రాంగోపాల్‌ వర్మ

పొగడ్త లేదా విమర్శ అని సందేహం వ్యక్తం చేసిన నెట్‌జన్‌లు

ఆదిపురుష్ సినిమా టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్‌

సైఫ్‌ అలీఖాన్‌ పాత్ర అన్‌ నాచురల్‌ గా ఉందంటూ ట్రోల్స్‌

అలావుద్దీన్ ఖిల్జీలా కనిపిస్తున్నారని ట్రోల్‌

రావణుడి చిత్రీకరణ ఓ నియంతను తలపిస్తోందని పోస్ట్‌లు

పుష్పక విమానాన్ని కూడా భయంకరమైన గద్దలా చూపించారా..?

మహా పండితుడి నుదుటిపై తిలకం ఎందుకు లేదు...

హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకు అవమానిస్తున్నారు?..

అంటూ మండిపడుతున్న హిందుత్వ వాదులు

ఎన్టీఆర్‌ ఫోటోలను షేర్‌ చేస్తున్న మూవీ ఫ్యాన్స్‌

Tags

Read MoreRead Less
Next Story