Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ రాజకీయాలు.. మరో చిత్రానికి 'వ్యూహం'

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు తానెప్పుడూ రాంగ్ రూట్‌లో వెళ్లనని ఓ ప్రగాఢ నమ్మకం. ఆయన మీద ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరెన్ని అన్నా తాను చేసేదంతా కరెక్టే అని చెప్పుకుంటాడు. తనకు నచ్చినట్లు ఉంటాడు. ఎవరేమనుకున్నా నాకేంటి నా లైఫ్ నాది.. బిందాస్‌గా జీవితాన్ని గడిపేస్తుంటాడు. తాను తీసిన సినిమాలు హిట్టా, ఫట్టా పక్కన పెడితే ఖాళీగా అయితే అస్సలు కూర్చోడు. ఏదో ఒక సినిమా తీసి సంచలనం సృష్టిస్తాడు. నలుగురూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. దటీజ్ ఆర్జీవీ అనిపించుకుంటాడు.
తాజాగా మరో రాజకీయ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. వ్యూహం అనే పొలిటికల్ డ్రామా తీయబోతున్నట్లు తెలిపాడు. ఇది బయోపిక్ కాదు అంతకంటే ఎక్కువ. రియల్ పిక్.. ఇందులో అబద్దాలు అస్సలు ఉండవు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన కథ ఇది. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే ఈ వ్యూహం చిత్రం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇది రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి పార్ట్ వ్యూహం అయితే రెండో పార్ట్ శపథం. రెండింటిలోనూ అరాచక రాజకీయాలు పుష్కలంగా ఉంటాయి. ప్రేక్షకులు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపే ఎలక్ట్రిక్ షాక్ మాదిరిగా పార్ట్ 2 శపథం రూపంలో తగులుతుంది.
వ్యూహం చిత్ర నిర్మాత గతంలో వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎన్నికలను టార్గెట్ చేసుకునే ఈ చిత్రాన్ని తీస్తున్నారని అనుకుంటారు. అయితే అది అవునో కాదో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com