Ram Gopal Varma : షో మ్యాన్ గా రాంగోపాల్ వర్మ ప్రధాన పాత్రలో

నిజ జీవితంలో "షో మ్యాన్" ఆయిన దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం "షో మ్యాన్". "మ్యాడ్ మాన్స్టర్" అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. సుమన్ విలన్ గా నటించిన రజినీకాంత్ చిత్రం "శివాజీ" ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. "నూతన్" అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఆర్జీవీతో ఇంతకుముందు "ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2" చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి... భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

