Ram Gopal Varma: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఆ హీరోయిన్స్‌తో పోల్చిన రాంగోపాల్ వర్మ..

Ram Gopal Varma: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఆ హీరోయిన్స్‌తో పోల్చిన రాంగోపాల్ వర్మ..
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Ram Gopal Varma: రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' గురించి ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మ్యానియా నడుస్తోంది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇంకా ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు ఈ సినిమాను చూస్తూ అభినందిస్తూనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే ఇంకా ఆర్ఆర్ఆర్ మ్యానియా నుండి బయటికి రాకుండా తాజాగా ఈ మూవీపై మరో ట్వీట్ చేశాడు.

రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా.. అందులో ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. కానీ మొదటిసారి ఏ కాంట్రవర్సీ లేకుండా ఆర్ఆర్ఆర్ సినిమాపై తన రివ్యూను అందించాడు వర్మ. రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లను ప్రశంసలతో ముంచేశాడు. ఆర్ఆర్ఆర్ ఒక మ్యాజిక్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తాజాగా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఆర్ఆర్ఆర్‌నే ఉపయోగించాడు..

రామ్ గోపాల్ వర్మ 'డేంజరస్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది ఒక లెస్బియన్ లవ్ స్టోరీతో తెరకెక్కిన సినిమా. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్ కోసం ఆర్ఆర్ఆర్‌ను ఉపయోగించుకున్నాడు వర్మ. 'రాజమౌళి సార్.. మీ దగ్గర రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లాంటి డేంజరస్ మెన్ ఉంటే.. నా దగ్గర అప్సర రాణి, నైనా గంగూలి లాంటి డేంజరస్ ఉమెన్ ఉన్నారు'. అంటూ రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫోటోలతో పాటు ఆ హీరోయిన్లతో తాను దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు వర్మ.

Tags

Next Story