Ram Gopal Varma: వర్మ మళ్లీ గుచ్చాడు.. ఈసారి టార్గెట్ పవన్ కళ్యాణ్..

Ram Gopal Varma: వర్మ మళ్లీ గుచ్చాడు.. ఈసారి టార్గెట్ పవన్ కళ్యాణ్..
Ram Gopal Varma: పుష్పనే అంత కలెక్ట్ చేసినప్పుడు భీమ్లా నాయక్ కూడా అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేస్తుందని ప్రశ్నించారు వర్మ.

Ram Gopal Varma: ప్రస్తుతం తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపైనే కన్నేశారు. కథ అన్ని భాషల ప్రేక్షకులకు అర్థమవుతుందా..? పాన్ ఇండియా రేంజ్‌కు కథ కనెక్ట్ అవుతుందా..? కలెక్షన్ల విషయంలో రిస్క్ చేయొచ్చా..? లాంటి అంశాలను ఏమీ పట్టించుకోకుండా సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈసారి పవన్ కళ్యాణ్‌ను, ఆయన నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని టార్గెట్ చేశారు. ఆ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ చేయమంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు.

మీ తర్వాత వచ్చిన పిల్లలైన ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లాంటి వాల్లే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పుడు మీరు ఓన్లీ తెలుగు సినిమాలకే పరిమితం కావడం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా హిందీలో విడుదల చేయొద్దని ఎంత మొత్తుకున్నా వినలేదని.. దాని ఫలితం చూసారని వర్మ అన్నారు. ఇప్పుడైనా భీమ్లా నాయక్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయమని, పవర్ ప్రూవ్ చేయమని కోరారు.

పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్‌ను, అల్లు అర్జున్ నటించిన పుష్పను పోల్చి వరుసగా ట్వీట్లు చేశారు వర్మ. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కథ ఒక భాషకు సంబంధించిందని.. అందులోనూ అది కొన్ని జిల్లాలకే పరిమితమైన సమస్యతో తెరకెక్కిందని అన్నారు.


అలాంటి పుష్ప సినిమానే అంత కలెక్ట్ చేసినప్పుడు భీమ్లా నాయక్ కూడా అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేస్తుందని అభిప్రాయపడ్డారు వర్మ. భీమ్లా నాయక్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయకపోతే ఒక ఫ్యాన్‌గా బన్నీ ఫ్యాన్స్‌కు ఆన్సర్ చేయలేకపోతున్నామన్నారు. అల్లు అర్జున్ గురించి చేసిన ట్వీట్స్ వోడ్కా టైమ్‌లో చేశానని, మీ గురించి చేసిన ట్వీట్స్ కాఫీ టైమ్‌లో చేస్తున్నాను కాబట్టి సీరియస్‌నెస్ అర్థం చేసుకోండి అంటూ వర్మ సీరియస్‌గా ట్వీట్ చేశారు.

భీమ్లా నాయక్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకువెళ్లి సబ్ కా బాప్ అనిపించుకోవాలని కోరారు. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు పాన్ ఇండియా సబ్జెక్లు అయినప్పుడు, భీమ్లా నాయక్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదా అని ప్రశ్నించారు ఆర్జీవీ. 'ఓటమికి భయపడడమే నిజమైన ఓటమి' అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ మధ్యనే ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై వరుస ట్వీట్లతో హల్‌చల్ చేసిన రామ్ గోపాల వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై ట్వీట్ వార్ చేశారు.



Tags

Next Story