మళ్లీ గిల్లాడు.. మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

మళ్లీ గిల్లాడు.. మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
వివాదాల వర్మ ఈరోజేం వినిపించబోతున్నాడని విమర్శకులు సైతం ఆసక్తితో ఎదురు చూసేలా కామెంట్స్ చేస్తుంటాడు.

వివాదాల వర్మ ఈరోజేం వినిపించబోతున్నాడని విమర్శకులు సైతం ఆసక్తితో ఎదురు చూసేలా కామెంట్స్ చేస్తుంటాడు. మొత్తానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనో, రాస్తూనో వార్తల్లో ఉంటాడు. ఈసారి మెగా ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు. ఎవరికీ రాని డౌట్స్ ఆయనకే వస్తాయి. అనేందుకు అస్సలు వెనకాడడు.

అవును అల్లు అర్జున్ మామ మెగాస్టార్ బర్త్‌డేకి ఎందుకు రాలేదు అని ఎవరికైనా అనిపించిందా. ఆ విషయమే ఆర్జీవీ మదిని తొలిచింది. మెగా ఈవెంట్‌కి హాజరైన వాళ్లంతా పరాన్న జీవులని అంటే అందరూ ఆయన పేరు చెప్పుకుని పైకి వచ్చారని, ఒక్క బన్నీ మాత్రం కష్టపడి పైకి వచ్చాడు. అందుకే అతడే రియల్ మెగాస్టార్ అంటూ కామెంట్ చేశాడు.

గతంలోనూ మెగా ఫ్యామిలీపై సెటైర్స్ వేసిన వర్మ.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ అనేక కామెంట్లు చేశాడు. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వర్మని ఏకి పారేశారు. అయినా తగ్గని వర్మ మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు.

అప్పుడెప్పుడో అల్లు ఫ్యామిలీపై కామెంట్ చేసిన వర్మ ఇప్పుడు బన్నీని వెనకేసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటని మనం అస్సలు ఆలోచించక్కర్లేదు.. వర్మ అంటే అంతే.. ఓ వెరైటీ వ్యక్తి. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. కానీ కచ్చితంగా వార్తల్లో ఉంటాడు. అందుకు సినిమాలే తీయక్కర్లేదు. అమ్మాయితో డ్యాన్స్ చేసే ఓ వీడియో పోస్ట్ చేసినా తెగ వైరల్ అవుతుంది. దటీజ్ ఆర్జీవీ. ఓ సెన్సేషనల్ క్రీచర్.

Tags

Read MoreRead Less
Next Story