RGV : 'ఈడు నిజంగా ఆయన చుట్టమైతే.. నాకు ఆయన మీదే ఇంప్రెషన్ పోయింది '.. RRR వివాదం పై RGV

RGV : బాహుబలి మూవీ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్.. కరోనా వలన పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు రేపు (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి ఈ సినిమాలో నటిస్తుండడంతో సినిమా పైన మరింత ఆసక్తి పెరిగింది. రిలీజ్ కి ముందు వివాదంలో చిక్కుకుంది ఈ చిత్రం.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అల్లూరి పాత్రను వక్రీకరించారని అల్లూరి మనవడు లక్ష్మీపతిరాజు అన్నారు. సినిమాలో ఏది పడితే అది చూపిస్తే జనాలు అదే నిజం అనుకునే ప్రమాదం ఉందని అన్నారు.. అల్లూరి బ్రిటీష్ సైన్యంలో పనిచేయలేదని, ఎక్కడ డాన్స్ చేయలేదని అన్నారు. రేపు సినిమా రిలీజై అల్లూరి అభిమానుల మనోభావాలు దెబ్బతిని జరగరాని సంఘటనలు జరిగితే దానికి రాజమౌళి బాధ్యత వహించాలని లక్ష్మీపతి రాజు అన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. ట్విట్టర్ లో " ఈడు కానీ నిజంగా అల్లూరి సీతరామరాజు చుట్టమైతే నాకు అల్లూరి సీతరామరాజు మీదే ఇంప్రెషన్ దొబ్బింది" అని అర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.
Eedu Kaani nijam gaa Alluri seetharamaraju chuttamaithe ,naaku Alluri seetharanama raju meedhe impression dhobbindhi https://t.co/EROHhGnRRz
— Ram Gopal Varma (@RGVzoomin) March 23, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com