నా ఫస్ట్‌లవర్‌ ఫొటో ఇదే..తొలిప్రేమపై స్పందించిన ఆర్జీవీ..!

నా ఫస్ట్‌లవర్‌ ఫొటో ఇదే..తొలిప్రేమపై స్పందించిన ఆర్జీవీ..!
Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. తరచూ వివాదాల్లో నిలవడం అర్జీవీ స్పెషాలిటీ. ఇటీవలే ఇనయా సుల్తానా అనే అమ్మాయి బర్త్ డే పార్టీకి హాజరైన వర్మ నానా హంగామా చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మీద ఒట్టేసి చెబుతున్నాను అంటూ ట్వీట్ చేశాడు. అయితే తాజాగా వర్మ తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా తన ఫస్ట్‌ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ రామ్ గోపాల్ వర్మ బిటెక్‌ చదివిన విషయం తెలిసిందే. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని, ఆమె మెడిసిన్‌ చేసినట్లు తెలిపాడు.

అంతేగాక బీచ్ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న సత్య ఫొటోలను తన ట్వీట్‌లలో షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా సత్య సిద్దార్థ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ చేసిందని చెప్పుకొచ్చాడు. అవి రెండు క్యాంపస్‌లు ఒకేచోట ఉండటంతో.. రోజు సత్యను చూసేవాడినని, అలా ఆమె ప్రేమలో పడిపోయానని తెలిపాడు. కానీ ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉందని.. దాంతో తనని పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినని చెప్పాడు. అలా 'రంగీలా' మూవీ స్టోరీ పుట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పాడు. వర్మ ట్వీట్ పై సత్య స్పందిస్తారో లేదో చూడాలి.
Tags

Read MoreRead Less
Next Story