Ram Gopal Varma: అదేంటి.. ఆర్‌జీవి ఇలా అనేశాడు..!

Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ.. ఈయన కాంట్రవర్సీలు సృష్టించడంలో స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో పెట్టుకుంటున్నాం, వారి గురించి ఏం మాట్లాడుతున్నాం, అలా మాట్లాడితే ఏమైనా కాంట్రవర్సీ అవుతుందా లాంటి విషయాలు వర్మకు అవసరం లేదు. ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించగానే ముందు వెనుక ఆలోచించకుండా ట్విటర్‌లో పోస్ట్ చేయడం ఈయన హాబీ. తాజాగా ఈ దర్శకుడు చైతూ, సమంత విడాకులపై ట్విటర్‌లో స్పందించాడు.
'పెళ్లి కంటే విడాకులనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లిలో మనం ఎందులో ఇరుక్కుంటామో తెలీదు.. కానీ విడాకుల వల్ల ఇరుక్కున్న దానిలో నుండి బయటపడతాం' అని విడాకుల గురించి ఆయన మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసారు. అంతే కాదు 'పెళ్లిళ్లు నరకంలో నిర్ణయించబడతాయి విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి' అని ఆర్‌జీవి స్టైల్ కామెంట్ పెట్టారు. 'పెళ్లిళ్లు జరిగినన్ని రోజులు కూడా నిలబడట్లేదు. అందుకే సంగీత్ అనేది విడాకుల తర్వాత అమ్మాయి, అబ్బాయి సెలబ్రేట్ చేసుకోవడానికి జరగాలి' అన్నారు.
పెళ్లిపై రామ్ గోపాల్ వర్మకు బాగా కోపం ఉన్నట్టుంది. అందుకే దానిని చాలా వెరైటీగా పోల్చాడు. మ్యారేజ్ అంటే బ్రిటీష్ రూల్ అని.. విడాకులు అంటే స్వాతంత్ర్యమని, మ్యారేజ్ అంటే హిట్లర్ అని ఏవేవో పోలికలతో ట్వీట్ చేశాడు. మ్యారేజ్ అంటే చావని.. డైవర్స్ అంటే పునర్జన్మని.. రాసుకొచ్చాడు. టాలీవుడ్ లో ఏదైనా ఇష్యూ జరిగితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం మామూలే. కాకపోతే.. ఇలా చైతూ, సామ్ విడాకులపై ఈ స్థాయిలో దాదాపు అరడజను ట్వీట్లు పెట్టేసరికీ దానిపై డిస్కషన్ జరుగుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com