Ram Gopal Varma: ఎవరైనా, ఎప్పుడైనా పోవచ్చు: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma (tv5news.in)
Ram Gopal Varma: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల ఎందరో సినీరంగ ప్రముఖులు మాత్రమే కాదు.. స్పోర్ట్స్, పొలిటికల్ సెలబ్రిటీలు కూడా సంతాపం తెలియజేశారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఒక గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరం అంటూ ప్రేక్షకులు సైతం తమ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఆర్జీవీ కూడా ఒకరు.
'రామ్ గోపాల్ వర్మ.. విషయం ఎంత సీరియస్ అయినా.. దానికి తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవ్వడం ఆయన స్పెషాలిటీ. అలాగే పునీత్ రాజ్‌కుమార్ మరణం విషయంలో కూడా ఆర్‌జీవి తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశారు.
పునీత్ రాజ్‌కుమార్ అనూహ్య మరణం చాలా షాకింగ్‌గా ఉంది. మనలో ఎవరైనా, ఏ సమయంలో అయినా మరణించవచ్చు అనే నిజాన్ని తెలుసుకోవడానికి ఇదొక కనువిప్పు కూడా. అందుకే మనం బ్రతికున్నప్పుడే ఫాస్ట్ ఫార్వడ్‌లో బతికేస్తే మంచిది' అని ట్వీట్ చేశారు వర్మ.
Apart from the shocking tragedy that @PuneethRajkumar 's sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime 😳😳😳 So it is best to live life on a fast forward mode , while we are still alive🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com