Ram Gopal Varma: 'నాకు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉంది': ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..

Ram Gopal Varma: నాకు అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma: ముందుగా ధనుష్, ఐశ్వర్యల విడాకులపై వర్మ స్పందించారు.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనే. ఆయన ఎప్పుడు దేని గురించి స్పందించినా, అది ఒక సెన్సేషన్ అవ్వక తప్పదు. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఒంటరిగా పోరాడిన వర్మ.. నిర్ణయాన్ని ఇక ప్రభుత్వానికే వదిలేశారు. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షో గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆర్జీవీ.

ముందుగా ధనుష్, ఐశ్వర్యల విడాకులపై వర్మ స్పందించారు. వరుసగా విడాకుల తీసుకుంటున్న సెలబ్రిటీ కపుల్స్‌పై ట్వీట్లు చేశారు. 'సెలబ్రిటీల విడాకుల తరువాతి తరం వారికి పెళ్లి ఎంత డేంజర్ తెలియజేస్తాయి' అని విడాకులపై తన ట్వీట్లను మొదలుపెట్టారు వర్మ. 'పెళ్లే ప్రేమను హత్య చేస్తుంది. సంతోషంగా ఉండడానికి సీక్రెట్ ఏంటంటే ప్రేమ ఉన్నంత వరకు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి అనే జైలులో పడకుండా విడిపోవాలి' అన్నారు.

'పెళ్లిని సెలబ్రేట్ చేసుకున్నని రోజులు కూడా.. పెళ్లి తర్వాత పెళ్లి నిలబడదు. అది కేవలం 3 నుండి 5 రోజులే' అని ట్వీ్ట్ చేశారు ఆర్జీవీ. 'తెలివైన వారు కేవలం ప్రేమిస్తారు. తెలివితక్కువ వారు పెళ్లి చేసుకుంటారు' అని ఒకేసారి విడాకుల తీసుకున్న సెలబ్రిటీ జంటలపై వరుస ట్వీట్‌లతో తన అభిప్రాయాలను బయటపెట్టారు వర్మ. ఇలా ట్వీట్లు చేస్తూనే సడెన్‌గా అన్‌స్టాపబుల్ షోపైకి తన మనసును మళ్లించారు.

'నాకు ఆహాలో వచ్చే అన్‌స్టాపబుల్ విపరీతంగా నచ్చింది. నాకు ఆ షోకు వెళ్లాలని ఉంది. బాలయ్య గారు నాకు ఆ అవకాశం ఇస్తారని ఆశపడుతున్నాను' అని వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మరి ఆర్జీవీ కోరుకున్నట్టు బాలయ్య స్పందించి ఆయన షోకు పిలిస్తే.. ఫన్ మామూలుగా ఉండదు అనుకుంటున్నారు అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story