సినిమా

Ram Gopal Varma: 'జెర్సీ' సినిమాపై ఆర్‌జీవీ షాకింగ్ రివ్యూ.. సింపుల్‌గా ఒక్కమాటలో..

Ram Gopal Varma: హిందీ జెర్సీ చాలా వాయిదాల తర్వాత ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది.

Ram Gopal Varma: జెర్సీ సినిమాపై ఆర్‌జీవీ షాకింగ్ రివ్యూ.. సింపుల్‌గా ఒక్కమాటలో..
X

Ram Gopal Varma: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమా.. తన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటికే నానికి నేచురల్ స్టార్ అన్న పేరు ఉన్నా.. ఈ సినిమాలో నాని పాత్రను ఇంకా ఏ నటుడు చేయలేడేమో అన్న విధంగా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక హిందీ జెర్సీపై ఇటీవల ఆర్‌జీవీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిందీ జెర్సీలో హీరోగా షాహిద్ కపూర్ నటించాడు. ఇంతకు ముందు షాహిద్ నటించిన 'అర్జు్న్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో షాహిద్ బ్యాక్ టు బ్యాక్ రీమేక్‌‌లు చేయాలని డిసైడ్ అయ్యాడు. అలాగే తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలో దర్శకుడిగా పరిచయం చేస్తూ అక్కడ జెర్సీని సేమ్ టైటిల్‌తో రీమేక్ చేశాడు.

హిందీ జెర్సీ చాలా వాయిదాల తర్వాత ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'నాని జెర్సీ సినిమానే హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసుంటే నిర్మాతలకు 10 లక్షల్లో ఖర్చు అయిపోయేది. కానీ హిందీలో రీమేక్ చేయడం వల్ల 100 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ డబ్బు, సమయం, కష్టం అంతా వృథా అయిపోయింది' అన్నాడు ఆర్జీవి. సింపుల్‌గా ఒక్కమాటలో దీనికి ఇలా రివ్యూ ఇచ్చేశాడు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES